Advertisement
Google Ads BL

1400 కోట్లు ఈ టాలీవుడ్ సినిమా బ‌డ్జెట్


1400 కోట్లు.. అక్ష‌రాలా ప‌ద్నాలుగు వంద‌ల కోట్లు. ఈ సంఖ్య విన‌డానికి ఎంత సింపుల్ గా ఉందో అంత‌కంటే ఎక్కువ బ‌రువు తూగుతోంది. ఇంత పెద్ద మొత్తం వెచ్చించి సినిమా తీయ‌డానికి ఇదేమైనా హాలీవుడ్డా?  జస్ట్ టాలీవుడ్...! ఇంత చిన్న ప‌రిశ్ర‌మ‌లో అంత పెద్ద బ‌డ్జెట్ పెట్టి ఏ సినిమా తీస్తున్నారు? అంటే... దీనికి స‌మాధానం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అంతేకాదు.. హాలీవుడ్ లో పీసీ న‌టించిన సిరీస్ `సిటాడెల్` కోసం ఏకంగా రూ.2800 కోట్లు ఖ‌ర్చు చేస్తే, ఇప్పుడు ఒక తెలుగు హీరో న‌టించిన సినిమా కోసం సుమారు అందులో సగం బ‌డ్జెట్ ని కేటాయించారు. నిజంగా ఇది సాహ‌సంతో కూడుకున్న‌ది.

Advertisement
CJ Advs

నిజానికి బాహుబ‌లి తో సాహ‌స‌యాత్ర మొద‌లు పెట్టాడు రాజ‌మౌళి. ఆ సినిమాకి 250 కోట్ల బ‌డ్జెట్ ఖ‌ర్చు చేసారు అన‌గానే అంద‌రికీ క‌ళ్లు భైర్లు క‌మ్మాయి. బాహుబ‌లి రెండు భాగాల‌కు క‌లుపుకుని దాదాపు 500 కోట్లు పైగా పెట్టార‌ని తెలిసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే ఆ రెండు భాగాలు క‌లుపుకుని ఏకంగా 2200 కోట్లు వ‌సూలు చేయ‌డం సంచ‌ల‌నం. 

ఆ త‌ర్వాత ఆర్.ఆర్.ఆర్ కోసం 500 కోట్లు ఖ‌ర్చు కేసిన రాజ‌మౌళి మ‌రో 1000 కోట్ల క్ల‌బ్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా `వార‌ణాసి` కోసం 1400 కోట్లు ఖ‌ర్చు చేస్తుండ‌డం స‌ర్వ‌త్రా ఉత్కంఠ క‌లిగిస్తోంది. ఒక అంచ‌నా ప్ర‌కారం మ‌హేష్ - రాజ‌మౌళి జోడీ వార‌ణాసి చిత్రాన్ని ఒక డీసీ- యూనివ‌ర్శ‌ల్ ఫ్రాంఛైజీ సినిమాలాగా అత్యంత భారీగా రిలీజ్ చేస్తార‌ని భావిస్తున్నారు. అంత‌ర్జాతీయ మార్కెట్ల నుంచి సులువుగా డ‌బ్బు ఆర్జించే మార్గాన్ని జ‌క్క‌న్న అన్వేషిస్తున్నాడ‌ని కూడా అర్థం చేసుకోవ‌చ్చు.

Varanasi Budget:

Varanasi Movie Budget
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs