Advertisement
Google Ads BL

కాంగ్రెస్ హవా - కేటీఆర్ విలవిల


బీఆర్ఎస్ ప్రభుత్వం నచ్చకే కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. కానీ కేటీఆర్ పదేళ్లుగా తెలంగాణ కు మంచి చేసాం అంటూ సీఎం రేవంత్ రెడ్డిని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ.. ఎప్పటికప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తుండే కేటీఆర్ కు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు బిగ్ షాక్ ఇచ్చాయి. 

Advertisement
CJ Advs

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా చూసి కేటీఆర్ కు నోటమాట పడిపోయి ఉంటుంది. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా 5 కార్పొరేషన్లలో కాంగ్రెస్ గెలుపొందింది. ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ హవా చూసి కేటీఆర్ కి నిజంగా షాక్ తగిలే ఉంటుంది. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం బీఆర్ఎస్ కి ఇచ్చిన షాక్ నుంచి తేరుకునేలోపే.. పంచాయితీ ఎలక్షన్స్, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ బీఆర్ఎస్ ని నట్టేట ముంచేసాయి. ఎలాగైనా కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తుంది అని నిరూపిద్దామనుకున్న ప్రతిసారి బీఆర్ఎస్ కు అవమానమే దక్కుతుంది. 

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోలుకుంటుంది అని ఆశపడిన కేసీఆర్ కు, కేటీఆర్ కు ఈ ఫలితాలు నిద్రపట్టకుండా చేసాయి అని మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి తో పెట్టుకోవద్దు, లేదంటే ఇంకెన్ని పరాజయాలు మూటగట్టుకోవాలో చూసుకో అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఛాలెంజ్  చేస్తున్నారు.

Telangana Municipal Election Results 2026:

Telangana municipal polls - No clean sweep for Congress
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs