Advertisement
Google Ads BL

జగన్ పక్కన దువ్వాడ


ఈరోజు బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తిని మళ్లీ అక్కున చేర్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది వైసీపీ అధినేత జగన్ వ్యవహారం. అసెంబ్లీకి రాకపోతే సస్పెండ్ చేస్తారేమో అని భయపడి అసెంబ్లీ సెషన్ మొదలైన రోజు జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్లే వైసీపీ అధినేత జగన్ సేమ్ ఈరోజు అదే చేసారు.

Advertisement
CJ Advs

జగన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి 10 నిమిషాల్లో వాకౌట్ చేసి వెళ్లిపోతున్న సమయంలో తాను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దువ్వాడ తో మాట్లాడడం చర్చనీయాంశం అయ్యింది. పార్టీ కి అప్రతిష్ట తెస్తున్నాడనే కారణంతో అప్పట్లో దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. ఆతర్వాత దువ్వాడ ను జగన్ కలిసిన సందర్భమే లేదు.

కానీ ఇప్పుడు సడన్ గా మీడియా ముందే జగన్ మోహన్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఎమ్యెల్సీ దువ్వాడ తో మట్లాడుతూ తనని కలిసి మాట్లాడమని చెప్పడం చూసి జగన్ మళ్లీ జగన్ దువ్వాడ ను దువ్వుతున్నాడా అని మాట్లాడుకుంటున్నారు జనాలు. దువ్వాడ శ్రీనివాస్ భార్య పిల్లలను వదిలేసి మాధురి తో కలిసి ఉంటున్నాడు, సోషల్ మీడియా రీల్స్ తో వైసీపీ కి అప్రతిష్ట తీసుకొస్తున్నాడు అని అతన్ని సస్పెండ్ చేసారు. 

కానీ దువ్వాడ తను జగన్ వెనుకే ఉంటాను, జగన్ తోనే ఉంటాను, మాట్లాడి జగన్ మనసు మారుస్తా అన్నాడు, కానీ జగనే మనసు మార్చుకుని దువ్వాడ ను పక్కనపెట్టుకుంటున్నాడు. 

YS Jagan Talking With Duvvada Srinivas At Assembly:

MLC Duvvada Srinivas Meets YS Jagan At Assembly
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs