Advertisement
Google Ads BL

రాజసాబ్ మళ్లీ మొదలైన ట్రోలింగ్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ థియేటర్స్ లో జనవరి 9 న విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అప్పుడే సోషల్ మీడియాలో ప్రభాస్ బాడీ డబుల్స్ పై విపరీతమైన ట్రోలింగ్ నడవగా, ప్రభాస్ లుక్స్ పై మరింతగా విమర్శలొచ్చాయి. సరే అది మరిచిపోయేలోపు రాజసాబ్ ఓటీటీ వెర్షన్ ప్రభాస్ ఫ్యాన్స్ ని మరింతగా టెన్షన్ పెట్టింది.

Advertisement
CJ Advs

రాజసాబ్ ఓటీటీ వర్షన్ చూసాక యాంటీ ఫ్యాన్స్ ప్రభాస్ లుక్స్, మారుతి డైరెక్షన్, హీరోయిన్స్ గురించి, కమెడియన్స్ గురించి అన్నటికన్నా సీన్ టు సీన్ ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రాజసాబ్ ని తెగ ట్రోల్ చేసారు. ప్రభాస్ బాడీ డబుల్స్ పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ అభిమానులను బాగా ఆందోళన పెట్టింది. ఇక ప్రభాస్ ఇతర క్రేజీ ప్రాజెక్ట్స్ పై బిజీగా ఉండడంతో ఫ్యాన్స్ కాస్త డైవర్ట్ అవుతున్నారు అనుకునేలోపు మరో ట్రోల్ రాజసాబ్ పై స్టార్ట్ అయ్యింది. 

అదే హీరోయిన్ ని కూడా మారుతి బాడీ డబుల్ ని పెట్టడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ లు హీరోయిన్స్. అందులో నిధి అగర్వాల్ కి నార్మల్ రోల్ దక్కగా మాళవిక కు కాస్త బెటర్ రోల్ దక్కింది. అందులో ఓ ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంది. కానీ ఆ ఫైట్ సీక్వెన్క్ లో మాళవిక డూప్ ని పెట్టినట్లుగా తాజాగా ఓ ఫోటో వైరల్ అవుతోంది.

రాజాసాబ్ ఫైట్ మాస్టర్ మాళవిక డూప్ తో దిగిన ఫోటో చూసివారు.. హీరోనే కాదు హీరోయిన్ విషయంలోనూ బాడీ డబుల్ ఏంటి మారుతి అంటూ మరోసారి మారుతిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 

The Raja Saab trolling has started again:

The Raja Saab Movie Malavika Mohanan dupe
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs