Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్లాన్


పాన్ ఇండియా స్టార్ గా బాలీవుడ్ లో పుష్ప సీరీస్ తో బలమైన ముద్ర వేసిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ తో మూవీ చేస్తున్నారు. ముంబై లోనే ఎక్కువగా షూటింగ్ కోసం స్టే చేస్తూ.. నార్త్ లో క్రేజ్ పెంచుకుంటున్న అల్లు అర్జున్ పై కుట్ర జరుగుతుందా, లేదంటే ప్లాన్ ప్రకారమే ఆయన ఇమేజ్ డ్యామేజ్ చెసే ప్లాన్స్ జరుగుతున్నాయా అనే అనుమానాలు బన్నీ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
CJ Advs

అల్లు అర్జున్ ని కలవాలంటే 42 నిబంధనలు ఉంటాయని, ఆయన కళ్లలోకి నేరుగా చూడకూడదనే వింత కండిషన్స్ ఉన్నాయంటూ ఓ పాడ్ కాస్ట్ లో ఒక మీడియా సేల్స్ ప్రొఫెషనల్ చేసిన కామెంట్స్ నెట్టింట దుమారాన్ని రేపాయి. అల్లు అర్జున్ గురించి తెలిసిన వారంతా ఈ కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్నారు.

అసలు ఆమె ఎందుకిలా మాట్లాడిందో, ఎవరైనా కావాలని మాట్లాడించారా.. లేదంటే ఆమె వైరల్ అవ్వాలని అలా మాట్లాడిందా అనే కోణంలో అల్లు ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అవుతుంటే.. అల్లు టీమ్ రంగంలోకి దిగి లీగల్ గా ప్రొసీడ్ అవుతుంది. ఎప్పుడు హుందాగా ఉండే అల్లు అర్జున్ పై ఇలాంటి ఆరోపణలు రావడంపై ఆయన ఫ్యాన్స్ చాలా హార్ట్ అవుతున్నారు. 

అల్లు అర్జున్ ఎదుగుదల చూసి ఓర్చలేకే ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు, ఆయన ఇమేజ్ డ్యామేజ్ చెయ్యాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదేమి వర్కౌట్ అవ్వదులే అంటూ గట్టిగా కౌంటర్స్ వేస్తున్నారు. 

Allu Arjun Denies Baseless Claims:

Allu Arjun Denies Baseless Claims About Professional Interactions and Meeting Protocols
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs