Advertisement
Google Ads BL

అలర్ట్ అవుతున్న ప్రభాస్ డైరెక్టర్స్


రాజసాబ్ టాక్ చూసాక అందులోను ఓటీటీ రెస్పాన్స్ చూసాక ప్రభాస్ తో ప్రస్తుతం సెట్ పై ఉన్న దర్శకులు అలర్ట్ అవుతున్నారు. కారణం రాజసాబ్ ఓటీటీ వర్షన్ చూసిన వారు ప్రభాస్ బాడీ డబుల్స్ పై చేస్తున్న కామెంట్లు ప్రభాస్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఇకపై బాడీ డబుల్స్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ భయపడేలా పడేలా రాజాసాబ్ ట్రీట్మెంట్ ఉంది.

Advertisement
CJ Advs

ఏ యాక్షన్ సీన్స్ లోనో బాడీ డబుల్స్ ఓకే కానీ.. ఎక్కువ సీన్స్ లో ప్రభాస్ బాడీ డబుల్స్ చూసి అందరూ షాకవుతున్నారు. రాజసాబ్ తో ప్రభాస్ బాడీ డబుల్స్ పై విపరీతమైన చర్చకు తెరతీశారు. అందుకే ప్రభాస్ నెక్స్ట్ సినిమాలపై ఆ ఎఫెక్ట్ ఉండకూడదు అని ఫౌజీ దర్శకుడు హను రాఘవపూడి, స్పిరిట్ డైరెక్టర్ సందీప్ వంగ కీలక నిర్ణయం తీసుకున్నారనే టాక్ మొదలయ్యింది.

ఈ రెండు సినిమాల్లో ఫీల్ పోకుండా, అభిమానులను డిజప్పాయింట్ చెయ్యకుండా ప్రభాస్ ని కష్టపెట్టాల్సిందే అని డిసైడ్ అయ్యారట. అంటే యాక్షన్ సీక్వెన్స్ లోను ప్రభాస్ తోనే చేయించాలని అనుకుంటున్నారట. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న మూవీలో ప్రభాస్ ఓ సైనికుడిగా కనిపించనున్నారు. 

సినిమాను రియాలిస్టిక్‌ గా చూపించడానికి హను రాఘవుడి అండ్ టీమ్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ప్రభాస్ విషయంలోనూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప డూప్స్ లేదా బాడీ డబుల్స్ వాడకూడదని టీమ్ డిసైడ్ అయిందట. అటు సందీప్ వంగ కూడా స్పిరిట్ విషయంలో ప్రభాస్ ని పర్ఫెక్ట్ గా వాడేందుకు తగిన డేట్స్ లాక్ చేసుకున్నాడట. సో ఈసారి ప్రభాస్ కష్టపడక తప్పేలా కనిపించడం లేదు. 

Prabhas directors:

Prabhas 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs