మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా పోలీసులు హై డ్రామా నడుమ అరెస్ట్ చేసి గుంటూరు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అంబటికి 14 రోజులు రిమాండ్ విధించగా అంబటి తనని రాజమండ్రి జైలుకు పంపవల్సిందిగా కోర్టును కోరడంతో దానికి కోర్టు అనుమతినిచ్చింది.
తాజాగా అంబటికి ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దానితో అంబటి రాంబాబు విడుదలవుతారని అందరూ అనుకున్నారు. అంబటి రాంబాబు బెయిల్‌పై విడుదలవుతున్న సమయంలోనే పట్టాభిపురం పోలీసులు మరో కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
గతంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై అంబటిపై నమోదైన కేసులో పీటీ వారెంట్‌పై అంబటిని స్పెషల్ జ్యుడీషియల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన కోర్టు ఆయనకు 14 రోజుల పాటు అంటే ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సో ఒక కేసులో బెయిల్ మరో కేసులో జైలు అనేసరికి ఆయన అభిమానులు షాకయ్యారు.