పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కలయికలో క్రేజీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రంలో తిప్తి డుమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే ఆ విషయమై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.
కానీ తాజాగా ప్రకాష్ రాజ్ స్పిరిట్ మూవీ నుంచి తప్పుకున్నారని, కాదు సందీప్ రెడ్డి వంగ తప్పించారనే టాక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియా నేషనల్ మీడియాలో ప్రకాష్ రాజ్ స్పిరిట్ నుంచి అవుట్ అనే వార్తలు తాటికాయంత అక్షరాలతో ప్రచురితమయ్యాయి.
తాజాగా ఈ విషయమై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. To all the toxic #Fakenews peddlers…. On #Spirit the movie. We have not even started shooting for my scenes .. and you whatsup factories speculate stories. Grow up and have a life 😂😂😂😂. #justasking
ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చేస్తున్నారు, మీరు మామూలోళ్లు కాదు, స్పిరిట్ లో అసలు నా పాత్రకు సంబందించిన సీన్స్ షూట్ కూడా జరగలేదు, కానీ మీరు అప్పుడే నా గురించి నిరాధారమైన వార్తలు అల్లేస్తున్నారు. కాస్త బుద్ధి తో ఆలోచించండి అంటూ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు.