విమానంలో సిబ్బంది సరిగా సహకరించలేదని, తప్పుగా ప్రవర్తించారని సెలబ్రిటీలు చాలాసార్లు ఆరోపించడం చూస్తున్నాం. ఫలానా ఎయిర్ లైన్స్ సర్వీసులు బాలేదని, గ్రౌండ్ స్టాఫ్ సహకారం బాలేదని నివేదించిన సందర్భాలున్నాయి. ఇక ఐదు నక్షత్రాల హోటల్ లో సిబ్బంది రూడ్ ప్రవర్తన గురించి కొన్ని ఫిర్యాదులు సెలబ్రిటీల నుంచి ఉన్నాయి. ఇలాంటివి చాలా రేర్ అయినా సెలబ్రిటీ మ్యాటర్ గనుక పెద్ద రేంజులో చర్చకు తెర తీస్తుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడి కుమార్తె అయిన పాపులర్ నటి చెన్నైలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్ లో క్రియేట్ చేసిన రుబాబ్ చర్చగా మారింది.
ఐదు నక్షత్రాల హోటల్ లో రూమ్ బుక్ చేసినా పెద్ద కెమెరాను తన వెంట తీసుకు వెళ్లడానికి నిరాకరించారని, దీంతో తన కెమెరా, కెమెరామెన్ హోటల్ బయటే గంటల సమయం ఎదురు చూడాల్సి వచ్చిందని రిసెప్షనిస్టుతో గొడవ పెట్టుకోవడంతో అది కాస్తా రభసగా మారింది. ఈ రభసను ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో తనే స్వయంగా షేర్ చేయడంతో నెటిజనులు హోటల్ సిబ్బందిని సమర్థిస్తూ, హోటల్ నియమాలను ఉల్లంఘించి రిసెప్షనిస్టులు ఉద్యోగాలు చేయడం కుదరదు! అంటూ సదరు సెలబ్రిటీ కిడ్ ని నానా తిట్లు తిడుతున్నారు.
నిజానికి పెద్ద కెమెరాలను లోనికి అనుమతించాలంటే అది కమర్షియల్ కేటగిరీ కింద ఐదు నక్షత్రాల హోటల్ వాళ్లు బిల్లు వేస్తారు. దానిని ఎగ్గొట్టేందుకు వ్యక్తిగత రూమ్ బుక్ చేసి కెమెరా తీసుకెళతానంటే ఊరుకుంటారా? అంటూ సదరు నటీమణిని గేలి చేస్తున్నారు. ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్న సదరు స్టార్ కిడ్ ముంబైలో సెటిలై ఫ్రెండ్సు తో జాలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారనే ప్రచారం ఉంది.