వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లో అప్పుడే కచ్చిఫ్ వేస్తున్నవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతికి బిగ్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి.. వచ్చే ఏడాది వెంకీ తో కలిసి 2027 సంక్రాంతికి వస్తున్నట్టుగా ఎప్పుడో క్లారిటీ ఇచ్చెయ్యగా.. ఈ మద్యలో చిరు-బాబీ చిత్రంతో పాటుగా బాలయ్య-గోపీచంద్ మలినేని ల చిత్రం కూడా సంక్రాంతి కే అంటున్నారు.
కానీ వారికన్నా ముందే కింగ్ నాగార్జున 2027 సంక్రాంతి అనడమే కాదు డేట్ కూడా ఫిక్స్ చేసి షాకిచ్చారు. వాసివాడి తస్సాదియ్యా 💫✨వచ్చే 15th జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్ గా ఉంటాది కదా💥 🔥🔥 డేట్ మార్క్ చేసుకోండి 🤩అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ వేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
నాగార్జున-కళ్యాణ్ కృష్ణ కలయికలో సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు వారి కాంబో నుంచి రాబోతున్న మూడో సినిమా వాసివాడి తస్సాదియ్యా అని అనౌన్స్ చేస్తూ దాని రిలీజ్ డేట్ లాక్ చేసి నాగార్జున ఇలా ట్వీట్ వేసారు అంటూ అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.