సౌత్ నుంచి నార్త్ వరకు నిత్యం షూటింగ్స్ తో బిజీ బిజీ జీవితాన్ని గడిపే ఓ హీరోయిన్ ఈ నెలలో చేసుకోబోయే పెళ్లి కోసం షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకోబోతుందట. ఆమె ఎవరో ఈపాటికే గెస్ చేసి ఉంటారు. నేషనల్ క్రష్ రష్మిక. హిందీ సినిమాలతో, తెలుగు, తమిళ సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉంటే రష్మిక ఈ నెలలోనే పెళ్లి పీటలెక్కబోతుంది.
ఫిబ్రవరి 26 న రష్మిక పెళ్లి. బాయ్ ఫ్రెండ్ హీరో విజయ్ దేవరకొండ ని రష్మిక వివాహమాడబోతుంది. విజయ్ దేవరకొండ కూడా రెండు సినిమాలు రౌడీ జనార్ధన, రణబాలి సినిమా షూటింగ్స్ తో బిజీగా అవున్నారు. ఆయన కూడా పెళ్లి కోసం షూటింగ్స్ నుంచి చిన్నపాటి బ్రేక్ తీసుకుంటారని తెలుస్తుంది.
రష్మిక, విజయ్ దేవరకొండ లు ముంబై లో పెళ్ళికి సంనదించిన డిజైనర్ వేర్ డ్రెస్సులు షాపింగ్స్ పూర్తి కాగా.. బెంగుళూరు కి పెళ్ళికి సంబందించిన పూల డెకరేషన్ ఆర్డర్ వెళ్లిందట. రాజస్థాన్ ఉదయపూర్ కోటలో ఈ నెల 26 న రష్మిక-విజయ్ దేవరకొండ ల వివాహ ఏర్పాట్లు జరుగుతాయట.