యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో ఎప్పుడో ఏడాది క్రితం మొదలైన డ్రాగన్(వర్కింగ్ టైటిల్) చిత్ర షూటింగ్ విషయాలు కానీ, అందులో నటించే నటుల వివరాలు కానీ ఇప్పటివరకు అప్ డేట్ రూపం లో మేకర్స్ ఇవ్వకుండా ఊరిస్తున్నారు. కనీసం రిపబ్లిక్ డే నుంచి సినిమా పోస్ట్ పోన్ అన్న విషయాన్నీ కూడా క్లారిటీ ఇవ్వలేదు.
మరి సంక్రాంతికి ఎన్టీఆర్-నీల్ అప్ డేట్ ఉంటుంది ఆశపడి భంగపడిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మహాశివత్రి స్పెషల్ గా ఏమైనా NTR 31 అప్ డేట్ దొరుకుంటుందా.. ఈనెల 15 న మహా శివరాత్రి, ఆ రోజు మేకర్స్ ఎన్టీఆర్-నీల్ అప్ డేట్ ప్లాన్ చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.
ప్రస్తుతం ఎన్టీఆర్-నీల్ సెట్ లోకి మలయాళ స్టార్ హీరో తోవినో థామస్ ఎంటర్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. జోర్డాన్ లో జరగబోయే కీలక షెడ్యూల్ లో తోవినో జాయిన్ అవుతాడని, ఎన్టీఆర్-తోవినో మద్యన కీ సీన్స్ ప్రశాంత్ నీల్ జోర్డాన్ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారని తెలుస్తుంది.
ఈ చిత్రంలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తుండగా.. కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కనిపిస్తారని టాక్.