రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ఫిలిం వారణాసి, ఓ పక్క షూటింగ్, మరోపక్క రాజమౌళి ఇంకా హీరో మహేష్, విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ లతో చేసిన వీడియో ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే.. రాజమౌళి ఎంచక్కా తన షూటింగ్ తను చేసుకుంటున్నారు.
ప్రస్తుతం రామోజి ఫిలిం సిటీలో పడవ ఫైట్ చిత్రీకరణ జరుగుతుంది. విలన్ పృథ్వీ రాజ్ కుంభ ఎంట్రీ సీక్వెన్స్ ని రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. మందాకినిగా కనిపించనున్న ప్రియాంక చోప్రా కి సంబందించిన షెడ్యూల్ రేపు అంటే ఆదివారంతో పూర్తి కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
సూపర్ స్టార్ మహేష్ ని ఐదు పాత్రల్లో చూపించనున్న రాజమౌళి పృథ్వీరాజ్ సుకుమారన్ ని స్టైలిష్ విలన్ గా చూపించబోతున్నారు. ఈ చిత్రం 2027ఏప్రిల్ 7 న విడుదలకాబోతుంది. అది కూడా ఒకే పార్ట్ గా వారణాసి విడుదల ఉంటుంది అంటూ రాజమౌళి రీసెంట్ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు.