Advertisement
Google Ads BL

2027 సంక్రాంతికి హిట్ ఫార్ములా రిపీట్


గతంలో ఎఫ్ 2, ఎఫ్ 3 లతో సంక్రాంతికి హిట్ కొట్టి తన హిట్ ఫార్ములా సంక్రాంతి అని ప్రతి ఏడు చెప్పకనే చెబుతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. గత ఏడాది అంటే 2025 సంక్రాంతి ఫెస్టివల్ కి సంక్రాంతికి వస్తున్నాం తో అల్లాడించిన అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు అంటూ హిట్ ఫార్ములాను రిపీట్ చేసారు.

Advertisement
CJ Advs

కామెడీ, ఫ్యామిలీ టచ్ ఇస్తూ సంక్రాంతి ఫెస్టివల్ కి కేరాఫ్ గా మారాడు అనిల్ రావిపూడి. మరి వచ్చే ఏడు అంటే 2027 కి అనిల్ రావిపూడి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు, వెంకీ తో సినిమాని ఎలాంటి ఫార్ములాతో తీసుకురాబోతున్నాడు అనే విషయంలో చాలామందిలో విపరీతమైన క్యూరియాసిటీ నడుస్తుంది. మరి వెంకటేష్ తో అనిల్ రావిపూడి ఈసారి ఎలాంటి కథతో రాబోతున్నారో తెలుసా..

మలయాళ క్రేజీ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ని వెంకీ కి బావమరిదిగా తీసుకొచ్చి కామెడీ పండించబోతున్నాడట. వ‌దిన, మ‌ర‌ద‌ళ్ల మ‌ధ్య న‌లిగిపోయిన ఈ ఇద్ద‌రు మ‌గాళ్లు, వాళ్ల ఫ‌స్ట్రేష‌న్‌ చుట్టూ నే అనిల్ రావిపూడి తదుపరి మూవీ కథ ఉండబోతుందని తెలుస్తుంది. ఇందులోనే ఫ్యామిలీ ఎలిమెంట్స్ కావాల్సినంతగా రంగరిస్తారట.

సో అనిల్ రావిపూడి ఈసారి కూడా తన హిట్ ఫార్ములానే రిపీట్ చెయ్యబోతున్నాడనేది స్పష్టమవుతుంది. మరి అనిల్-వెంకీ-ఫహద్ ల సినిమాకి పండక్కి వస్తున్నారు అనే టైటిల్ పెట్టబోతున్నారని టాక్. 

Anil Ravipudi-Venkatesh combo story line:

Anil Ravipudi-Venkatesh combo story line leaked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs