ప్రస్తుతం థియేటర్ ఆడియన్స్ నుంచి ఓటీటీ ఆడియన్స్ వరకు, నార్త్ నుంచి సౌత్ వరకు ధురంధర్ 2 రాక కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ లో ఎలాంటి హడావిడి లేకుండా బాలీవుడ్ లో మాత్రమే అంటే ఒక్క హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే విడుదలై సన్సేషన్ క్రియేట్ చేసిన ధురంధర్ కి పార్ట్ 2 మార్చ్ 19 న రాబోతుంది.
థియేటర్స్ లోనే కాదు ఓటీటీ లోను బ్లాక్ బస్టర్ హిట్ అయిన ధురంధర్ రివెంజ్ ని చూసేందుకు పాన్ ఇండియా ఆడియన్స్ మాత్రమే కాదు పాకిస్తాన్ ఆడియన్స్ వరకు వెయిట్ చేస్తున్నారు అంటే ధురంధర్ 2 పై ఎంత క్రేజ్ ఉందొ అర్ధమవుతుంది. ధురంధర్ పార్ట్ 2 కి ఎన్ని సినిమాలు ఎదురొచ్చినా ఓపెనింగ్స్ పరంగా దుమ్మరేపడం కాదు కాదు బీభత్సం సృష్టించడం ఖాయం.
రణ్వీర్ సింగ్-ఆదిత్య ధర్ లు ఈసారి ధురంధర్ 2 ఓపెనింగ్స్ తో రికార్డ్స్ బ్రేక్ చెయ్యడం గ్యారెంటీ అంటున్నారు. ధురంధర్ పార్ట్ 1 కి పెద్దగా ఓపెనింగ్స్ పడలేదు, రెండోరోజు మౌత్ టాక్ తో సినిమా కలెక్షన్స్ పెరుగుతూ వచ్చింది. కానీ ధురంధర్ 2కి మాత్రం ఆ సమస్య లేదు, ప్రస్తుతం ఉన్న హైప్ తో ధురంధర్ 2 కి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ గ్యారెంటీ.