Advertisement
Google Ads BL

రాజాసాబ్ - సినిమా కాదురోయ్ అది సీరియల్


ది రాజసాబ్ జనవరి 9 న విడుదల అన్నా జనవరి 8 నుంచే ప్రీమియర్స్ తో హడావిడి స్టార్ట్ చేసింది. కానీ ఆ ప్రీమియర్స్ రాజసాబ్ ని నిండా ముంచేసాయి. రాజాసాబ్ ప్రీమియర్స్ పూర్తి కాకుండానే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది, దానితో ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడింది. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎంతో కొంత నచ్చినా యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రాజసాబ్ ని ట్రోల్ చేసారు.

Advertisement
CJ Advs

దర్శకుడు మారుతి అయితే రాజసాబ్ విడుదలయ్యాక సక్సెస్ మీట్ లో బింకాలు పోయిన తర్వాత.. ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకి అజ్ఞాతంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ చిత్రం జియో హాట్ స్టార్ నుంచి ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీ లో రాజసాబ్ ని చూసేందుకు ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూయించడం లేదు.

పిచ్చి మూవీ లవర్స్ మాత్రం రాజసాబ్ ని ఓటీటీ లో చూద్దామని పెట్టి.. గంటలు గంటలు చూస్తూ అరే బాబు అసలు రాజాసాబ్ సినిమా కాదురోయ్ అది సీరియల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్ క్లోజప్ షాట్స్ చూసి ప్రభాస్ ఇక సినిమాలు ఆపేస్తే బెటర్ అంటున్నారు, మారుతి మనమీదకి కళాకండాన్ని వదిలాడు అంటున్నారు. 

రాజసాబ్ హర్రర్ కామెడీ ఏమిట్రా.. అందులో కామెడీ ఎక్కడుంది, హారర్ ఎక్కడుంది.. ప్రభాస్ ని జోకర్ ని చేసావ్ కదరా మారుతి..  అది సినిమానా లేక సీరియల్ ఆ, బుర్ర పిచ్చెక్కిపోతుందిరా అంటూ సోషల్ మీడియాలో రాజసాబ్ ఓటీటీ అన్ కట్ వెర్షన్ చూసిన ఆడియన్స్ పెడుతున్న కామెంట్లు ప్రభాస్ ఫ్యాన్స్ ని మరింతగా బాధపెడుతున్నాయి. 

The Raja Saab OTT Responce :

The Raja Saab OTT Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs