కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవడమేమో కానీ.. ఆయన్ని సమస్యలు సుడిగుండంలా పట్టి పీడిస్తున్నాయి. గత ఏడాది జరిగిన కరూర్ తొక్కిసలాట, మరోపక్క ఈ ఏడాది జన నాయకన్ విడుదల కాకుండా సెన్సార్ సమస్యలు, మరోపక్క ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ. 1.5 కోట్ల జరిమానా విషయలో విజయ్ ఆ కేసును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం కొట్టివేసింది.
2015-16 అసెస్‌మెంట్ కాలానికి సంబంధించి తన అసలు ఆదాయాన్ని వెల్లడించలేదన్న కారణంతో విజయ్ కు ఐటి శాఖ పెనాల్టీ వేసింది. దానిని సవాల్ చేసిన విజయ్ కి కోర్టు షాకిచ్చింది. ఆ కోటిన్నర విజయ్ జరిమానా రూపంలో కట్టాల్సి ఉంది.
మరి రాజకీయాలేమో కానీ.. విజయ్ ని ప్రశాంతంగా పాలిటిక్స్ చేసుకోకుండా చేస్తున్నారు. ఏదో విధంగా బీజేపీ ప్రభుత్వం ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసి లాక్ చెయ్యాలనే ఉద్దేశ్యంతోనే కనిపిస్తుంది.