కంటే కూతురినే కనాలి! అంటూ ప్రేముఖ గేయ కవి రాసిన సినిమా పాట జనహృదయాలను తాకితే, ఆ పసిబిడ్డ జన్మించే ముందు పడ్డ కష్టాల గురించి తండ్రి ఏకరువు పెడుతుంటే, అది వినడానికి గుండె బిగబట్టాలని అర్థమవుతోంది. తన కుమార్తె మాల్తీ మేరీ ప్రీమ్యాచూర్ (నెలలు నిండక ముందు జననం) సమయంలో వంద రోజుల పాటు ఎలాంటి కష్టాన్ని పడిందో ఎలాంటి బాధను అనుభవించిందో నిక్ జోనాస్ వివరించిన తీరు హృదయాలను కలచివేస్తోంది.
వంద రోజుల పాటు, ప్రతిరోజూ మాల్తీ మేరీ ఉంటున్న ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి వెళ్లి తమ కుమార్తెను క్షేమంగా ఇంటికి ఎప్పుడూ తీసుకెళతామా? అని తాము ఎదురు చూసేవాళ్లమని నిక్ చెప్పిన తీరు హృదయాన్ని కలచి వేసింది. తన భార్య ప్రియాంక చోప్రా , తాను ఆ క్లిష్ఠ సమయంలో ఎంతో నిబ్బరంగా ధైర్యంగా ఉన్నామని కూడా నిక్ తెలిపారు.
మాల్తీ మేరీ గడువు తేదీ కంటే దాదాపు 12 వారాల ముందే జన్మించింది. అందువల్ల ఆరోగ్యం పరంగా బలహీనంగా జన్మించింది. ఆరుసార్లు రక్త మార్పిడి చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో తన కుమార్తె అనుభవించిన బాధ గురించి ఒక తండ్రిగా నిక్ వర్ణించిన తీరు హృదయాన్ని కలచివేసింది. అయితే అప్పుడు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఇప్పుడు మాల్తీ మేరీ ఆ ఇంట్లో ఆనందం నింపుతోంది. చిన్నారి మాల్తీ వేగంగా ఎదిగేస్తోంది. తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా వెలుతురు పంచుతోంది. కెరీర్ పరంగా చూస్తే, ప్రియాంక చోప్రా ప్రస్తుతం వారణాసి చిత్రంలో నటిస్తోంది. తదుపరి డాన్ 3, జీలే జరా లాంటి భారీ ప్రాజెక్టుల్లో నటించాల్సి ఉంది.