పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం రాజసాబ్. సంక్రాంతికి విడుదలైన థియేటర్స్ లో రాజసాబ్ కి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అందరూ చూసారు. మరీ పరువు పోకుండా ఎంతోకొంత ప్రభాస్ క్రేజ్ రాజసాబ్ ని కాపాడింది కానీ.. లేదంటే రాజసాబ్ డిజాస్టర్ దెబ్బకి నిర్మాత ఇప్పట్లో కోలుకునేవాడు కాదు. రాజసాబ్ సినిమా ప్లాప్ ఒక ఎత్తు, సోషల్ మీడియాలో ట్రోల్స్ మరో ఎత్తు.
దర్శకుడు మారుతి ని ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన ట్రోలింగ్ మరే ఇతర డైరెక్టర్ కి జరగలేదు. మారుతి ప్రభాస్ ని చూపించిన తీరుకి పూర్ విజువల్ ఎఫెక్ట్స్, మితిమీరిన బడ్జెట్ వేస్టేజ్ అన్ని రాజసాబ్ ని నిండా ముంచేసాయి. దానితో ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి ని టార్గెట్ చేసారు. థియేటర్స్ లో విడుదలయ్యాక రాజసాబ్ పై ఎన్ని ట్రోల్స్ వచ్చాయో అందరికి తెలుసు.
మరికొన్ని గంటల్లో హాట్ స్టార్ నుంచి ఓటీటీ కి రాజసాబ్ అన్ కట్ వెర్షన్ వదులుతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈలోపు సోషల్ మీడియాలో రాజసాబ్ ని ఓటీటీ లో వీక్షించేందుకు ఆడియన్స్ కాచుకుని కూర్చున్నారు. అందుకే అప్ డేటెడ్ సర్వర్లు, సర్వర్లు బద్దలు అంటూ హాట్ స్టార్ చేస్తున్న ఓవరేక్షన్ చూసిన వారు ఇప్పటివరకు వచ్చిన ట్రోల్స్ చాలవన్నట్టు ఇప్పుడు ఇది కూడానా.
ఇది కదా అసలు సిసలు రాజసాబ్ కామెడీ అంటూ నెటిజెన్స్ చేస్తున్న కామెంట్లు చూసి ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎక్కడ కాలుతుందో చూడాలి.