సామాజిక మాధ్యమాల్లో ఇష్ఠానుసారం అసభ్యకర వ్యాఖ్యలతో నిందించినందున యాంకర్ అనసూయ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది యాంకర్లు, గాయనీమణులకు ఇలాంటి ఆన్ లైన్ వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. ఫాలోవర్స్ రెండు వర్గాలుగా విడిపోయి ఇలాంటి వారిపై రకరకాల కామెంట్లు చేస్తుంటే దానిని తట్టుకోలేక ఒక్కోసారి ఏడ్చేస్తున్న సందర్భాలున్నాయి.
ఇప్పుడు ఇంచుమించు అలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటున్నారు ప్రముఖ మలయాళ గాయని కం నటి అభిరామి. తనను అసభ్యకరంగా దూషిస్తూ నెటిజనులు చేస్తున్న చేష్టలకు వారాల తరబడి రాత్రులు నిదుర కరువైందని అభిరామి ఆవేదన చెందారు. తాను ఒక కార్యక్రమానికి వెళితే, అక్కడ కెమెరాలు తన భంగిమలను క్యాప్చుర్ చేయడంతో అవన్నీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపైనా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు అభిరామి... నేటి రోజుల్లో సామాజిక మాధ్యమాలు చెత్త బుట్టల్లా మారాయి. అన్యాయంగా ఒకరిని అవమానించడానికే ప్రజలు పోటీపడుతున్నారని ఆవేదన చెందారు. అభిరామి గతంలో కొన్ని తెలుగు పాటల్ని కూడా పాడారు.