సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఒక్కొక్కటిగా ఓటీటీ లోకి చేరుతున్నాయి. ఇప్పటికే శర్వానంద్ నారి నారి నడుమ మురారి ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తే.. రేపు శుక్రవారం నుంచి రాజసాబ్ స్ట్రీమింగ్ లోకి వస్తుంది. ఈమద్యలో మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒకరాజు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాల ఓటీటీ డేట్స్ పై అందరిలో క్యూరియాసిటీ మొదలయ్యింది.
మన శంకర వరప్రసాద్ గారు థియేటర్స్ లో బిగ్ హిట్ అవడంతో ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ పై ఫ్యామిలీ ఆడియన్స్ కన్ను పడింది. తాజాగా ఈ చిత్ర ఓటీటీ పార్ట్నర్ జీ 5 మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ లాక్ చేసింది. తమ ప్లాట్ ఫామ్ నుంచి స్ట్రీమింగ్ చేయనున్న సినిమాల జాబితాను జీ 5 అప్‌డేట్ చేసింది.
అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కలయికలో తెరకెక్కి థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మన శంకర వరప్రసాద్ గారును జీ 5 నుంచి ఈనెల 11న స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా ఆ జాబితా లో ఉంది. సో వచ్చే వారం మన శంకర వరప్రసాద్ గారు ని ఓటీటీ లో వీక్షించేందుకు రెడీ అయిపోండి.