Advertisement
Google Ads BL

మెగాస్టార్ మూవీ నుంచి KVN త‌ప్పుకుంటుందా


మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా బాబీ కొల్లి  ద‌ర్శ‌క‌త్వంలో కె.వి.ఎన్ నిర్మాణంలో ఓ చిత్రం లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కి రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌ పరిణామంచోటు చేసుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి కేవీఎన్ త‌ప్పుకుంటుంద‌నే వార్త క‌న్న‌డ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Advertisement
CJ Advs

అందుకు కార‌ణంగా `జ‌న నాయ‌గ‌న్` హైలైట్ అవుతోంది. వివ‌రాల్లోకి వెళ్తే ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన `జ‌న నాయ‌గ‌న్` ని కేవీఎన్ ప్రొడక్షన్స్  నిర్మించిన సంగ‌తి తెలిసిందే. వివాదం నేప‌థ్యంలో జ‌న నాయ‌గ‌న్ రిలీజ్ క్లియ‌రెన్స్ లేదు. కోర్టు వివాదం నేప‌థ్యంలో నిర్మాత‌లు హైకోర్టు, సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఈ న్యాయపరమైన సమస్యల వల్ల నిర్మాణ సంస్థ కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేకపోతోందని సమాచారం.

దీంతో పాటు య‌శ్ టిస్తోన్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ ను ఇదే సంస్థ  నిర్మిస్తోన్న సంగ‌తి  తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ ప‌నుల్లోనూ సంస్థ బిజీగా ఉంది. పాన్ ఇండియా వైడ్ పెద్ద ఎత్తున ప్ర‌చారం ప్లాన్ చేస్తున్నారు. అలాగే `జన నాయగ‌న్` బడ్జెట్ స‌హా ఇతర ఆర్థిక లావాదేవీలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇలాంటి సమయంలో మరో భారీ బడ్జెట్ సినిమాను ప్రారంభించడం ఆర్థికంగా ఇబ్బందులకు దారితీయొచ్చని నిర్మాత‌లు భావిస్తున్నారుట‌.

చిరంజీవి సినిమా బాధ్య‌త‌లు మ‌రో నిర్మాణ సంస్థ‌కు అప్ప‌గించ‌డం లేదా?  భాగ‌స్వామ్యంలో నిర్మించే దిశ‌గా ఆలోచ‌న చేస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. వాస్త‌వానికి ఈ చిత్రాన్ని ముందుగా మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించాల‌నుకుంది. కానీ అనివార్య కార‌ణాల‌తో సంస్థ త‌ప్పుకుంది. మ‌రి తాజా ప‌రిస్థితుల్లో మైత్రీ మ‌ళ్లీ ముందుకొస్తుందా? అన్న‌ది చూడాలి.

KVN Productions :

Mega 158
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs