పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేస్తారా అని పవన్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మార్చ్ 26 ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉండొచ్చనే ఊహాగానాలను నిజం చేస్తూ.. ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.
ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేక విందుగా నిలవడంతో పాటు, అన్ని వయసుల ప్రేక్షకులను అలరించేలా వినోదభరితంగా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి గీతం దేఖ్‌లేంగే సాలాలో పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు కట్టిపడేసింది.
పవన్ కళ్యాణ్ లుక్, ఎనర్జీ, స్టెప్పులు పరంగా వింటేజ్ పవర్‌స్టార్ ను ఈ చిత్రంలో చూడబోతున్నారు. ఇక మార్చి 26న అసలుసిసలైన పవర్‌స్టార్ వేడుకకు సిద్ధంగా ఉండండి. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశిఖన్నా నటిస్తున్నారు.