Advertisement
Google Ads BL

భూమిక హ‌బ్బీ కూడా ప్ర‌భాస్ టైపే


ఎవ‌రైనా ఇంటికొచ్చారంటే? భోజ‌నం తినిపించ‌కుండా వ‌ద‌ల‌రు ప్ర‌భాస్, ఎన్టీఆర్. ఈ విష‌యంలో ఇద్ద‌రు ఒకే త‌ర‌హా మ‌న‌స్త‌త్వం గ‌ల‌వారు. తెలిసినా వారైనా..తెలియ‌ని వారైనా ఆప్యాయంగా త‌మ‌కోసం ఎవ‌రు వ‌చ్చినా? త‌మ ఇంటి రుచులు చూడాల్సిందే. ప్ర‌త్యేకించి ప్ర‌భాస్ ఈ విష‌యంలో ఎంత మాత్రం ప‌ట్టు విడ‌వరు.

Advertisement
CJ Advs

షూటింగ్ లో ఉంటే త‌న చుట్టూ ఉన్న‌  వాళ్లంద‌రు ఇంటి రుచులు చూడాల్సిందే. హీరోయిన్లు..న‌టీన‌టులు ఎవ‌రైనా నాన్ వెజ్ వంట‌కాలు రుచి చూసి పీడ్ బ్యాక్ ఇవ్వాల్సిందే. అప్పుడ‌ప్పుడు  ప్ర‌త్యేక‌మైన రోజుల్లో  ప్ర‌భాస్ ఇంటి నుంచి స్పెష‌ల్ వంట‌కాలు టాలీవుడ్ సెల‌బ్రిటీల ఇళ్ల‌కు వెళ్తుంటాయి. దీన్ని త‌మ ఇంటి సంప్ర‌దాయంగా డార్లింగ్ భావిస్తారు.

తాజాగా వీరి జాబితాలో న‌టి భూమిక భ‌ర్త భ‌ర‌త్ ఠాకూర్ ను కూడా వేయాల్సిందే. యోగా టీచ‌ర్ కం రైట‌ర్ అయిన భ‌ర‌త్ ఠాకూర్-భూమిక ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత కూడా భూమిక సెకెండ్ ఇన్నింగ్స్ కొన‌సాగిస్తున్నారు. ఇలా ప్ర‌యాణం సాగుతుందంటే కార‌ణం భ‌ర్త స‌హ‌కారం ఉండ‌టంతోనే అన్న‌ది  భూమిక అభిప్రాయం.

భూమిక న‌టించిన సినిమాల‌ను భ‌ర‌త్ ఠాకూర్ మిస్ అవ్వ‌కుండా చూస్తారుట‌. అనంత‌రం ఆ సినిమాకు పీడ్ బ్యాక్ కూడా అందిస్తారుట‌. అలాగే ఇంటికి అతిధులు ఎవ‌రు వ‌చ్చినా? త‌ప్ప‌కుండా ఇంటి భోజ‌నం చేసే వ‌ర‌కూ వ‌ద‌లురుట‌. వారు వ‌ద్దు అని ఎంత రిక్వెస్ట్ చేసినా? ఆ విష‌యంలో మాత్రం రాజీప‌డ‌రుట‌. వారిని ఇబ్బంది పెట్టైనా స‌రే తినిపించేస్తారంది. ఒక‌వేళ తాను ఇంట్లో గ‌నుక లేక‌పోతే ఆ బాధ్య‌త నీదేనంటూ భూమిక‌కు రోజు ఇంట్లో చెప్పి వెళ్తారుట‌.

 

 

Bhumika husband Bharat Thakur:

Bhumika Chawla husband Bharat Thakur
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs