సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రం పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వారణాసి పై విపరీతమైన క్రేజ్. ఈ చిత్రంలో మహేష్ బాబు రుద్ర గా, ప్రియాంక చోప్రా మందాకినీ గా, పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా కుంభ పాత్రలో కనిపించబోతున్నారు.
తాజాగా మహేష్ బాబు రాజమౌళి తో వారణాసి చిత్రం ఎలా సెట్ అయ్యింది, వారణాసిలో తను నటించబోయే పాత్ర పై ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలతో పోలిస్తే వారణాసి చాలా డిఫ్రెంట్ గా ఉంటుంది. రాజమౌళి చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాను, యాక్షన్, అడ్వెంచర్, పురాణాలు, టైమ్ ట్రావెల్.. ఇలా ఎన్నో ఈ చిత్రంలో ఉన్నాయి.
నటుడిగానే కాదు రాజమౌళి అభిమానిగా వారణాసి కోసం నేనూ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాను. వారణాసి లో హీరోగా చేయడానికి మొదట్లో భయపడ్డాను. రాజమౌళి కథను వివరించిన విధానం నాలోని భయాన్ని పోగొట్టింది. వారణాసి లో నేను చెయ్యబోయే పాత్రల లుక్స్ కోసం చాలా రిహార్సల్స్ చేసాము. నేను ఇందులో రాముడి పాత్రలో కనిపించబోతున్నాను. రాముడు అంటేనే హుందాతనం.. రాముడు నిలబడే విధానం దగ్గర నుంచి పాత్రలో నటించడం వరకూ ఎన్నో రిహార్సల్స్ చేశాం. దాదాపుగా రెండు నుంచి నెలలు దానికోసమే కష్టపడ్డాం. రాజమౌళి నేను పరిగెత్తే విధానాన్ని కూడా మార్చారు.
సినిమాలో రెండు షాట్ల కోసం 6 నెలలు శిక్షణ తీసుకున్నాను. షాట్ పర్ఫెక్ట్ గా వచ్చేవరకు రాజమౌళి నిద్రపోరు, దాని కోసం ఎంత రిహార్సల్స్ అయినా చేస్తారు.. అంటూ వారణాసి లో తన పాత్ర పై అలాగే రాజమౌళి పై మహేష్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో సంచలంగా మారాయి.