మార్చ్ 19 న పాన్ ఇండియా మూవీ గా విడుదల కాబోతున్న ధురంధర్ 2 పై ఉన్న క్రేజు, అంచనాలు చూసి పలు భాషల హీరోలు సైలెంట్ గా మార్చ్ మూడో వారం నుంచి తప్పుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి కన్నడ వరకు చాలా సినిమాలు వాయిదా వేస్తున్నాయి. తెలుగులో రామ్ చరణ్ పెద్ది, నాని ప్యారడైజ్, అడివి శేష్ డెకాయిట్ కేవలం ధురంధర్ వల్లే వాయిదా పడ్డాయి.
మరోపక్క మార్చ్ 19 రాబోతున్న కన్నడ పాన్ ఇండియా మూవీ యష్ టాక్సిక్ కూడా వాయిదా దిశాగా అడుగులు వేస్తుంది, ధురంధర్ దెబ్బకి యష్ కూడా వెనక్కి తగ్గుతున్నాడనే న్యూస్ వినిపించినప్పటికీ.. యష్ టాక్సిక్ మాత్రం ధురంధర్ ని లెక్క చెయ్యమంటుంది. మార్చి 19 నే యధావిధిగా పాన్ ఇండియా మార్కెట్ లో టాక్సిక్ ని దించుతున్నారట మేకర్స్.
యష్ టాక్సిక్ పై కూడా మంచి అంచనాలున్నాయి, తమ సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకంతో సినిమా వాయిదా వేసే ఉద్దేశ్యం లేదు అని, మార్చి 19 నే టాక్సిక్ విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే టాక్సిక్ ప్రమోషన్స్ ని పాన్ ఇండియా లెవల్లో మొదలు పెట్టేందుకు యష్ అండ్ టీమ్ రెడీ అవుతుంది.