ఈమధ్యన చాలామంది హీరోయిన్స్ తమపై బురద జల్లేందుకు స్పెషల్ గా డబ్బులిచ్చి పీఆర్ టీమ్ తో నెగిటివిటి చేస్తున్నారు కొంతమంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పీఆర్ టీమ్స్ తో తమపై బురద జల్లేందుకు డబ్బు లిచ్చి మరీ ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ పలు ఇంటర్వ్యూలో పలువురు లైక్ పూజ హెగ్డే, రష్మిక ఇలా చాలామంది మాట్లాడుతున్నారు.
తాజాగా బాలీవుడ్ పీఆర్ వ్యవస్థపై నటి రకుల్ ప్రీత్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా హిందీలో హిట్ అందుకున్న రకుల్ ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. పీఆర్ వ్యవస్థ అనేది ఒక స్థాయి వరకు మాత్రమే పనిచేస్తుంది. మనం కష్టపడి పని చేసినప్పుడే దానికి తగిన ఫలితం లభిస్తుంది. గతంతో పోలిస్తే బాలీవుడ్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
పీఆర్ టీమ్ కి స్పెషల్ గా డబ్బు చెల్లించి ఇతరులపై బురద చల్లుతున్నారు. అలా కావాలని నెగెటివిటీ సృష్టించే వాళ్లకు నిద్ర ఎలా పడుతుంది. వాళ్లకు మనస్సాక్షి ఉండదా అని అనుకుంటాను. ఇలాంటివారు ఎప్పటికైనా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. నేను నా కాళ్ళ మీద ఎదిగి ఈ స్థాయికి వచ్చాను. నాకు పీఆర్ టీమ్ లేదు, ఆ అవసరం కూడా లేదు అంటూ రకుల్ ప్రీత్ ఘాటైన వ్యాఖ్యలు చేసింది.