Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ ప్లానింగ్ అలా ఉంటుంది


టాలీవుడ్ స్టార్ హీరోలెవరైనా ఇతర లాంగ్వేజ్ ల దర్శకులతో సినిమాలు చేస్తే.. వాళ్ళు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ పెడతారు. హీరోలకు అనుగుణంగా దర్శకులు ఉంటారు. గతంలో సలార్ ని ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ హైదెరాబాద్ లోనే షూట్ చేసారు. ఇప్పుడు ఎన్టీఆర్ తోనూ అదే జరుగుతుంది.

Advertisement
CJ Advs

కానీ ఈ విషయంలో అల్లు అర్జున్ ప్లానింగ్ వేరే లెవల్ లో ఉంది. పాన్ ఇండియా స్టార్స్ కి నార్త్ మర్కెట్ ఎంతో కీలకం, ఇంకా ఇంపార్టెంట్. అందుకే అల్లు అర్జున్ బాలీవుడ్ లో స్పెషల్ గా పిఆర్ టీమ్ తో భజన చేయించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అట్లీ తో చేస్తున్న మూవీ కూడా ముంబై లోనే ఎక్కువగా చిత్రీకరణ జరిగేలా చూసుకుంటున్నాడు. 

స్పెషల్ లొకేషన్స్ అంటే దుబాయ్ అలా వెళుతున్నారు తప్ప హైదరాబాద్ లో అసలు AA 22 షూటింగ్ అనేది జరగడం లేదు. ఇప్పుడు తాజాగా మొదలైన కొత్త షెడ్యూల్ ముంబై లో ఈ నెలాఖరు వరకు జరుగుతుంది. ముంబై లోని చిత్రకూట్ స్టూడియోలో దాదాపు అన్ని ఫ్లోర్స్ తీసేసుకుని అక్కడే AA 22 టీమ్ వర్క్ చేస్తున్నారు. 

అల్లు అర్జున్-అట్లీ సినిమా కి సంబందించిన మేజర్ షూట్ అంతా దాదాపుగా అక్కడే పూర్తి చేస్తారు అని తెలుస్తుంది. మరి ముంబై లో అంటే బాలీవుడ్ మీడియా స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అందుకే అల్లు అర్జున్ ఇలా ప్లాన్ చేసాడు అంటున్నారు. 

AA22 shooting update:

AA22 - Allu Arjun Stepping Stone to the Next Level
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs