Advertisement
Google Ads BL

పెద్ది పై క్లారిటీ వచ్చేదెప్పుడు


పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కతున్న పెద్ది మార్చి 27 అంటూ గత ఏడాదే రిలీజ్ డేట్ లాక్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి సాంగ్ ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూసాం, ఆ ఊపులోనే పెద్ది ని మార్చి 27 కి తెస్తున్నారని మెగా ఫ్యాన్స్ సంతోషపడిపోయారు.

Advertisement
CJ Advs

కానీ ధురంధర్ పార్ట్ 2 దెబ్బకి పెద్ధి మార్చి 27 నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ధురంధర్ క్రేజ్ మాములుగా లేదు. థియేటర్స్ లో, ఓటీటీ లో ఈ చిత్రం బిగ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అందుకే మార్చ్ 19 న విడుదలవుతున్న ధురంధర్ కి అడ్డుగా మనమెందుకు అని పెద్ది మేకర్స్ వెనక్కి తగ్గడంతో.. పెద్ది ప్రమోషన్స్ ఆగిపోయాయి.

అయితే పెద్ది ని మే 1 అంటే అఖిల్ లెనిన్ డేట్ కి లాక్ చేస్తారా, లేదంటే దసరా అంటున్నారు, అప్పుడు ఏమైనా విడుదల చేస్తారా అనే విషయంలో ఎన్నో ఊహాగానాలు నడుస్తున్నాయి. మరి ఈ ఊహాగానాలకు పెద్ది మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో అనేది తెలియడం లేదు. మరి పెద్ది పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎప్పుడు దిగుతుందో అనేది చూడాలి.

The Big Confusion Continues in Peddi:

 Ram Charan Peddi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs