ఈ ఏడాది సంక్రాంతి సీజన్ కి అంత మజా లేదు, కేవలం కామెడీ ఎంటెర్టైనెర్స్ మాత్రమే ఈ సీజన్ లో హైలెట్ అయ్యాయి అని చాలామంది చాలా ఫీలయ్యారు. ఈ ఏడాది సంక్రాంతి కి ప్రభాస్, చిరు, రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ పోటీపడ్డారు. అందులో చిరు, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ లు విజయాలు అందుకున్నారు.
కానీ వచ్చే ఏడాది సంక్రాంతి ఫైట్ ఇప్పటినుంచే హీటెక్కిస్తోంది. వచ్చే ఏడాది అంటే 2027 సంక్రాంతి కి నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కేబోయే NBK 111 ని రెడీ చేస్తున్నారు. అదే సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ చెయ్యబోయే మూవీ విడుదల అని అనిల్ రావిపూడి ఎప్పుడో చెప్పారు.
ఇప్పుడు అదే సంక్రాంతికి మరో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి-బాబీ కలయికలో మొదలు కాబోయే మెగా 158 రిలీజ్ అంటూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న న్యూస్ చూసి.. వావ్ ముగ్గురు సీనియర్ హీరోలు సంక్రాంతి బరిలో వినడానికే గూస్ బంప్స్ వస్తున్నాయి. వారి వారి అభిమానులైతే ఇది కదా అసలు సిసలు సంక్రాంతి ఫైట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.