Advertisement
Google Ads BL

మానసికంగా చంపేస్తున్నారు-బిగ్ బాస్ తనూజ


బిగ్ బాస్ రన్నర్ తనూజ ప్రస్తుతం హౌస్ నుంచి బయటికి వచ్ఛాక ఆమె లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నది. బిగ్ బాస్ హౌస్ లో ఆమె ఎక్కడ విన్నర్ అవుతుందో అని ఆమె తోటి నటీమణులు ఆమెను డీ గ్రేట్ చేస్తూ మాట్లాడి కళ్యాణ్ ని విన్నర్ చెయ్యాలని ప్రచారం చేసారు. ఆ విషయంలో క్లారిటీ అడిగితే శ్రీసత్య మమ్మల్ని తనూజ పిఆర్ టీం టార్గెట్ చేసింది, మమ్మల్ని ట్రోల్ చేస్తే ఊరుకుంటామా అంది.

Advertisement
CJ Advs

విన్నర్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని తనూజ ఫ్యాన్స్ రెచ్చగొట్టారు. మా తనూజ వల్లే కళ్యాణ్ విన్నర్ అయ్యాడు అని.. అప్పటినుంచి కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజ ను టార్గెట్ చేసి ఆమెను ట్రోల్ చెయ్యడం స్టార్ట్ చేసారు. అంతేకాకుండా ఆమె సోషల్ మీడియాలో కనిపించకపోవడం పై కూడా చాలామంది రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

తాజాగా తనూజ కూడా ఈ ట్రోల్స్ పై సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రతిదానికి నా పీఆర్ టీమ్ అంటూ నన్ను టార్గెట్ చేస్తున్నారు, నేను హౌస్ లో ఉన్నప్పుడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే నా అప్ డేట్స్ చూసాడు. నాకు ఎలాంటి పీఆర్ టీమ్ లేదు. నన్ను ట్రోల్ చేస్తున్నారు, నన్ను నీచంగా మాట్లాడుతున్నారు. ఆ కామెంట్స్ నా ఫ్యామిలీ మెంబెర్స్ చూస్తే ఎంత బాధపడతారు.

నేను ఎవ్వరిని ఒక్క మాట అనలేదు, ఎవరిని కించపరచలేదు, కానీ నన్ను మానసికంగా వేధిస్తున్నారు. నాపై ఎంతమంది ట్రోల్ చేసినా నేను మౌనాన్నే ఆశ్రయించాను తప్ప తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ నన్ను నన్నుగా ఉండనీయకుండా మానసింగా క్షోభ పెడుతున్నారు.. ప్లీజ్ నన్ను వదిలెయ్యండి, నా పని నేను చేసుకుంటున్నాను అంటూ తనూజ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. 

They are killing me mentally - Bigg Boss Thanuja:

Thanuja on Social Media Trolls 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs