వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కి గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అంబటిని పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం ముందు నిలబెట్టారు. న్యాయమూర్తి స్రవంతి ఆదివారం రాత్రి ఇరు వర్గాల వాదోపవాదనలు విన్న తర్వాత అంబటి కి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే అంబటి రాంబాబు తనను రాజమండ్రి జైలుకు పంపాలని రాంబాబు న్యాయమూర్తి స్రవంతిని కోరగా ఆ మేరకు న్యాయమూర్తి పోలీసులకు ఆదేశాలిచ్చారు. శనివారం హైడ్రామా నడుమ అంబటి రాంబాబు ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే అంబటి రాంబాబు చంద్రబాబు ని నోటికొచ్చినట్లు తిట్టడంతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అంబటి ఇంటిపై పడి రచ్చ చేసి ఆయన ఆస్తులను ధ్వంశం చేసారు.
అంబటిని అరెస్ట్ చెయ్యాలి అంటూ నానా రచ్చ చెయ్యగా.. పోలీసులు అంబటి రాంబాబు ని శనివారం రాత్రి 11 గంటలకు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.