అటు ఇటుగా ఒకేసారి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తమన్నా, సమంత, కాజల్ అగర్వాల్ ల మధ్యన స్నేహం ఎంతుందో ఎప్పుడు బయటకి రాలేదు, కానీ ఈ ఓల్డ్ బ్యాచ్ మొత్తం ఎప్పుడు బిజీగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు నయా ట్రెండ్ కోసం అంటే ఓ జ్యువెలరీ షాప్ కోసం వీరంతా కలవడం సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.
తమన్నా ముంబై లో ఓపెన్ చేసిన జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ లో తమన్నా తో పాటుగా కాజల్ అగర్వాల్, సమంత, మృణాల్ ఠాకూర్ ఇలా సెలబ్రిటీస్ అంతా ఒకే చోట కనిపించి కనువిందు చేసారు. తమన్నా తో కలిసి సమంత, కాజల్, మృణాల్ ఇలా అందరూ ఫొటోస్ కి ఫోజులిచ్చారు.
ఒకప్పుడు సౌత్ ని ఏలిన భామలు ఇలా ముంబై లో ఒకేచోట కలవడం వారి వారి అభిమానులను సంతోష పెట్టింది, త్రీ డ్రాగన్స్, 3 రోజెస్ అంటూ కాజల్, సమంత, తమన్నా పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారి వారి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.