సూపర్ స్టార్ మహేష్ బాబు-ఎస్.ఎస్ రాజమౌళి కలయికలో పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న వారణాసి చిత్ర టైటిల్ రివీల్ ఈవెంట్ నుంచే ఈ సినిమాపై అంచనాలు, క్రేజ్ పెరిగేలా చేసారు. రాజమౌళి ప్రమోషనల్ స్ట్రాటజిస్ చూసి ప్రతి ఒక్కరూ సర్ ప్రైజ్ అవుతుంటే.. నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా పొగడకుండా ఉండలేకపోతుంది.
తాజాగా వారణాసి వేదికగా వారణాసి రిలీజ్ డేట్ హోర్డింగ్స్ తో మతిపోగొట్టిన రాజమౌళి ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇకపోతే వారణాసి రెండు పార్టులుగా రాబోతుంది అనే ప్రచారం ఉండగా.. తాజాగా వారణాసి రెండు పార్టులు టైటిల్స్ పై క్రేజీ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది.
పార్ట్ 1 కి వారణాసి: గ్లోబ్ ట్రాటర్ అని, ఇక పార్ట్ 2 కి వారణాసి: టైం ట్రాటర్ గా లాక్ చేసినట్లుగా సోషల్ మీడియా టాక్. మరి ఈ విషయాన్ని రాజమౌళి ఎలా రివీల్ చేస్తారో అనేది అందరిలో క్యూరియాసిటీగా మెదులుతున్న ప్రశ్న.