ఈ సంక్రాంతికి విడుదలైన ఐదు సినిమాల్లో మూడు సినిమాలు హిట్ అవ్వగా ఒక సినిమా యావరేజ్ గాను, మరో సినిమా ప్లాప్ గా మిగిలిపోయాయి. రాజసాబ్ ప్లాప్, రవితేజ భర్తమహాశయులకు విజ్ఞప్తి యావరేజ్ కాగా.. చిరు మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒకరాజు, శర్వానంద్ నారి నారి నడుమ మురారి హిట్ అయ్యాయి.
ఇప్పటికే హిట్ సినిమాలు కూడా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంటూ ఉండడంతో ఒక్కోటిగా ఓటీటీ ఆడియన్స్ చెంతకు చేరేందుకు రెడీ అవుతున్నాయి. అందులో రాజసాబ్, నారి నారి నడుమ మురారి, చిరు మన శంకర వరప్రసాద్ లు ఇప్పటికే ఓటీటీ డేట్స్ లాక్ చేసేశాయి. రాజసాబ్ నాలుగు వారాలకు, నారి నారి మూడు వారాలకే ఓటీటీ బాట పట్టాయి.
ఇక మిగిలింది రవితేజ భర్తమహాశయులకు విజ్ఞప్తి , నవీన్ పోలిశెట్టి అనగనగ ఒకరాజు చిత్రాలు ఓటీటీ డేట్ లాక్ చేసుకోవాల్సి ఉంది. మన శంకర వరప్రసాద్ గారు, అనగనగ ఒకరాజు లు ఇంకా థియేటర్స్ నుంచి అంతో ఇంతో రాబడుతున్నాయి, కానీ రవితేజ భర్తమహాశయులకు విజ్ఞప్తి ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది.
మరి ఈ రెండు చిత్రాలు ఎప్పుడు ఓటీటీ లో దర్శనమిస్తాయో జస్ట్ వెయిట్ అండ్ వాచ్.