తెలంగాణాలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్‌ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి KCR ను ఈ శుక్రవారం విచారణకు రావాల్సిందిగా SIT ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. కానీ కేసీఆర్ శుక్రవారం విచారణకు వచ్చెందుకు కుదరదు అని, మరో రోజు విచారణకు అనుమతి ఇవ్వాలని SIT కి లేఖ రాసారు.
అంతేకాకుండా తన విచారణను హైదరాబాద్ నందినగర్ నివాసంలో కాకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరపాలని SIT కి రాసిన లేఖలో అభ్యర్ధించారు. కానీ SIT మాత్రం ఈ కేసులో KCRకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణ హాజరవ్వాలని ఆ నోటీసుల్లో సూచించింది.
SIT అధికారులు నందినగర్ కేసీఆర్ నివాసానికి నోటీసులు అంటించడమే కాదు, కేసీఆర్ ను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారించేందుకు నిరాకరించింది. నందినగర్ నివాసంలో KCR అందుబాటులో ఉండాలని, మా రికార్డుల్లో నందినగర్ అడ్రస్సే ఉంది, ఫామ్‌హౌస్ అడ్రస్ లేదు కాబట్టి అక్కడ విచారించలేం, విచారణ పరికరాలను ఫామ్‌హౌస్‌కు తీసుకువెళ్లలేం అంటూ SIT అధికారులు కెసిఆర్ కు షాకిచ్చారు.