కొంతమంది మేకర్స్ నిర్ణయాలపై హీరో అభిమానులు తీవ్రంగా వ్యతిరేఖించడం అనేది సర్వ సాధారణం. అందులోను పెద్ద పెద్ద హీరోల అభిమానులు కొన్ని విషయాల్లో చాలా ఎక్కువగా ఫీలవుతుంటారు. రాజాసాబ్ స్టార్ట్ అయినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు మారుతి ని తీవ్రంగా వ్యతిరేఖించారు. సినిమా విడుదల సమయానికి చల్లబడినా.. మారుతి వారి నమ్మకాన్ని వమ్ము చేసాడు.
ఇప్పుడు ప్రభాస్ అభిమానులు హీరోయిన్ విషయంలో అసంతృప్తితో కనిపిస్తున్నారు. అదే కల్కి 2 లో దీపికా పదుకొనె ను తప్పించినప్పుడు ఆమె తల బిరుసుకి, పొగరుకి ప్రభాస్ పక్కన నటించే అర్హత ఆమెకు లేదు అన్న ఫ్యాన్స్ ఇప్పుడు కల్కి 2 కోసం సాయి పల్లవి ని మేకర్స్ సంప్రదిస్తున్నారనే వార్తలు చూసి డిజప్పాయింట్ అవుతున్నారు.
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రభాస్ పక్కన తేలిపోతుంది, మరో బాలీవుడ్ హీరోయిన్ నే ప్రభాస్ కోసం తీసుకురండి అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ కు ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ పెడుతున్నారు. కల్కి 2 లో నటిస్తుంది సాయి పల్లవి అనే వార్తలు చూసి ఇంకా అనౌన్స్ చెయ్యలేదుగా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ లైట్ గా మాట్లాడుతున్నారు.