థియేటర్స్ కి ప్రేక్షకులు రావడం లేదు అని గగ్గోలు పెట్టె దర్శకనిర్మాతలు కొన్ని విషయాల్లో రియలైజ్ అవ్వాలి, లేదంటే థియేటర్స్ లో జనాలు కాదు ఈగలు తోలుకోవాలి. సినిమా వస్తుంది అంటే చాలు టికెట్ రేట్లు పెంచేసి ఆడియన్స్ ని దోచుకుంటారు, సరే అభిమానులు తమ హీరో కోసం చూస్తారు. అభిమానులు జేబులు చిల్లులు పడినా హీరో, నిర్మాతలకు ఏం అనిపించదు.
సరే టికెట్ రేట్లు పక్కనపెడితే.. థియేటర్స్ లో ప్లాప్ అయిన సినిమాని మూడు వారాలకే ఓటీటీ లో వదిలితే.. ఓకేలే థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసింది, పాపం నిర్మాతకు ఓటీటీ హక్కులతో అయినా సేవ్ అవుతాడు అనుకోవచ్చు. కానీ హిట్ అయిన సినిమాని నాలుగు వారాలు కాదు కాదు మూడు వారాలకే ఓటీటీ లోకి వదిలితే..
ఇక థియేటర్స్ కి ఎవరు వెళతారండి. థియేటర్స్ లో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి వస్తే ఎలాంటి నొప్పి లేకుండా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చూడొచ్చని ప్రతి ఒక్క ప్రేక్షకుడు అనుకుంటారు. అలాంటప్పుడు ప్రేక్షకులు థియేటర్స్ కి రావట్లేదు అని గగ్గోలు పెట్టకూడదు, థియేటర్ రెవిన్యూ రావట్లేదు అని ఏడవకూడదు.
ఓటీటీ కే అధిక ప్రాధాన్యం ఇస్తే థియేటర్స్ ని వదిలెయ్యండి, టికెట్ రేట్లు పెంచడం ఎందుకు ప్రేక్షకుడిని ఎర్రి పుష్పం చేయడానికా.. ఈ సంక్రాంతికి విడుదలైన రాజసాబ్ నాలుగు వారాల్లో ఓటీటీ కి వస్తుంటే.. అదే సంక్రాంతికి వచ్చి హిట్ అయిన నారి నారి నడుమ మురారి మూడు వారాలకే ఓటీటీ మెట్లు ఎక్కుతుంది. ఇలా అయితే ఎవరు వస్తారు థియేటర్స్ కి మీరే చెప్పండి.