దర్శకుడు మారుతి ని ఇప్పటివరకు ఏ హీరో ఫ్యాన్స్ అలా టార్చర్ చేసి ఉండరేమో, ప్రభాస్ ఫ్యాన్స్ టార్చర్ కి మారుతి షేక్ అయిపోతున్నాడు. రాజసాబ్ పై అతి నమ్మకం పెట్టి ఫ్యాన్స్ ని తనవైపు తిప్పుకున్నాడు మారుతి, సినిమా విడుదలయ్యాక కూడా ప్లాప్ ని కవర్ చేసేందుకు కష్టపడ్డాడు. కానీ రాజసాబ్ థియేట్రికల్ రన్ పూర్తయ్యి కలెక్షన్ చూసేసరికి ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొచ్చింది.
దానితో ఇంటి అడ్రెస్స్ చెప్పిన మారుతికి చుక్కలు చూపిస్తూ స్విగ్గి, జొమాటో ఆర్డర్స్ పెడుతున్నారు. సరే బిర్యాని నే కదా అనుకుంటే.. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి హింసిస్తున్నారు. దానితో సెక్యూరిటీ నుంచే మారుతి వాటిని వెనక్కి పంపేస్తున్నాడు. అదంతా సరే, మారుతి మళ్ళీ మెల్లగా తన తదుపరి సినిమా కోసం ప్రిపేర్ అయితే.. ఆ సినిమా పరిస్థితి ఎలా అంటుంది.
ఏ హీరోనో కరుణించి అవకాశమిస్తే ఆ సినిమా విడుదలయ్యేవరకు ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని ని స్పెషల్ గా టార్గెట్ చేస్తే ఆ సినిమా పరిస్థితి ఏమిటి, సినిమాని ఎలాగో పూర్తి చేసి విడుదలకు తీసుకొస్తే మారుతిపై నెగిటివిటీ చూపిస్తే ఆ సినిమా ఏమైపోవాలి, అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి పై రివెంజ్ తీర్చుకున్నది చాలు ఇకపై ప్రభాస్ మిగతా సినిమాలపై ఫోకస్ పెట్టమని జనాలు సలహాలు ఇస్తున్నారు.