బాలీవుడ్ లో అంచనాలు లేకుండా విడుదలై లాంగ్ రన్ లో రూ.1000 కోట్లు కొల్లగొట్టిన రణ్వీర్ సింగ్ ధురంధర్ చిత్రం థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొదటి రోజు స్లోగా స్టార్ట్ అయిన ధురంధర్ వెనక్కి తిరిగి చూడకుండా 50 రోజుల పాటు థియేటర్స్ లో దుమ్ము రేపింది. కేవలం ఒకే ఒక్క లాంగ్వేజ్ లో విడుదలైన ఈ చిత్రం రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టడం అందరికి షాకిచ్చింది.
ఇక థియేటర్స్ లో భారీ నిడివిని కూడా ఓపిగ్గా చూసిన ప్రేక్షకులకు ఓటీటీ వెర్షన్ కి మాత్రం బాగా మోసం చేసారు. నెట్ ఫ్లిక్స్ వేదికగా గత రాత్రి నుంచి ధురంధర్ పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ధురంధర్ ఓటీటీ వెర్షన్ చూసిన వారు మాత్రం చాలా డిజప్పాయింట్ అవుతున్నారు.
థియేటర్స్ లో 3 గంటల 34 నిమిషాల నిడివితో విడుదలైన ధురంధర్ ఓటీటీ కి వచ్చేసరికి 3 గంటల 20 నిమిషాలకు కుదించారు. మరి ఆ 14 నిముషాలు ఎందుకు కట్ చేసారో ఆడియన్స్ కు అర్ధం కావట్లేదు. థియేటర్స్ లో బోల్డ్ డైలాగ్స్ మ్యూట్ చేసారు, ఓటీటీ లో అన్ కట్ వెర్షన్ చూద్దాం అనుకుంటే.. ఆ విషయంలోనూ ధురంధర్ ఓటీటీ వెర్షన్ డిజప్పాయింట్ చేసింది అని ఓటీటీ ఆడియన్స్ అంటున్నారు.