దర్శకుడు మారుతి పై ద్వేషం పోగొట్టాలి, ఇప్పుడు ఇదే మారుతి స్నేహితులకు ఉన్న అతి పెద్ద సవాల్. ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి ని టార్గెట్ చెయ్యడం, మారుతి ప్రభాస్ ఫ్యాన్స్ ఏడిపించడం తో మారుతి మానసికంగా ఎక్కడ డిప్రెషన్ లకి వేళ్తాడో అని ఆయన ఫ్రెండ్స్ సోషల్ మీడియా వేదికగా మారుతి అలా, మారుతి ఇలా, ప్రభాస్ కే మారుతిపై కోపం లేదు.
ప్రభాస్ మారుతి తో మాట్లాడుతున్నారు, మారుతి కోసం ఇప్పటికే ప్రభాస్ రంగంలోకి దిగారు. వేరే నిర్మాత నుంచి మారుతి కి గతంలో అడ్వాన్స్ కూడా ఇప్పించారు, హీరో దొరకడమే తరువాయి, మారుతి కూడా ఒంటరిగా కథ పై కసరత్తు చేస్తున్నాడు, మారుతి సినిమా ఓపెనింగ్ కి ప్రభాస్ వచ్చినా రావొచ్చు, అసలు ప్రభాస్ కి లేని బాధ ఫ్యాన్స్ కి ఎందుకో..
రాజసాబ్ తప్పిదంలో మారుతి ఒక్కడిదే బాధ్యత కాదు, ఎంతమంది తప్పు ఉందొ అందరికి తెలుసు, అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ ఇకపై మారుతిని వదిలెయ్యండి, ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి స్నేహితులు చెప్పింది ఎక్కించుకుంటారో, లేదో చూడాలి.