సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ తన ప్రియుడు, ఎంగేజ్మెంట్ చేసుకుని ఏడడుగులు నడవాల్సిన కార్తీక్ విజయ్ తో బ్రేకప్ చేసుకుంది. ఆ విషయాన్ని రెండు రోజుల క్రితమే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే కీర్తి భట్-కార్తీక్ ఎందుకు విడిపోయారో తెలియని అభిమానులు, వారు కలవాలని, కార్తీక్ అర్ధం చేసుకుని కీర్తి భట్ తో కలిసిపోవాలని సోషల్ మీడియాలో కార్తీక్ ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.
దానితో కార్తీక్ వీడియో తో లైన్ లోకి వచ్చి కీర్తి భట్ తో నేను విడిపోలేదు, ఆమెకు నా కన్నా బెటర్ లైఫ్ దొరికింది, అందుకే ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుంది అంటూ వివరణ ఇచ్చాడు. గుడ్ క్లారిటీ అంటూ కీర్తి భట్ కార్తీక్ వీడియో పై వెటకారంగా రియాక్ట్ అయ్యింది. దానితో కీర్తి భట్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలయ్యింది.
యాక్సిడెంట్ లో ఫ్యామిలీ ని కోల్పోయి.. ఒంటరిగా మిగిలి, తల్లి కాకపోయినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చిన కార్తీక్ ని వదిలెయ్యడానానికి మనసెలా వచ్చింది అంటూ కీర్తి భట్ ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. దానితో మనస్తాపానికి గురయిన కీర్తి భట్ సోషల్ మీడియాలో చాలా వేధిస్తున్నారు.
నన్ను విమర్శించే, వేధించే వాళ్ళ పేర్లు రాసుకున్నాను, మానసికంగా వేధిస్తున్నారు, నాకు ఏమైనా అయితే దాని మీరే బాద్యులు అంటూ కీర్తి భట్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.