శర్వానంద్ లేటెస్ట్ హిట్ హిట్ చిత్రం నారి నారి నడుమ మురారి. సంక్రాంతి సీజన్ లో వచ్చిన శర్వానంద్ కి విజయం వరించినా లాభాలు రాలేదు. కారణం శర్వానంద్ నారి నారి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కింది, రాంగ్ టైమ్ లో థియేటర్స్ లో దిగింది. అదే గనక సంక్రాంతి సీజన్ కాకపోతే నారి నారి నడుమ మురారి కి లాభాలొచ్చేవి.
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కి జనవరి 14 న భోగి రోజున విడుదలైన నారి నారి నడుమ మురారి చిత్రం అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తుంది. సినిమా హిట్ అయ్యింది, అయినా నారి నారి థియేటర్స్ లో విడుదలైన మూడు వారాలకే అంటే 20 రోజులకే ఓటీటీ బాట పట్టి అందరికి షాకిచ్చింది.
అమెజాన్ ప్రైమ్ నారి నారి నడుమ మురారి ఓటీటీ హక్కులను దక్కించుకోగా.. ఇప్పడు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీలోనూ నారి నారి స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది