కొన్నేళ్లుగా సక్సెస్ లేక కొట్టుమిట్టాడుతున్న హీరో శర్వానంద్ ఈఏడాది నారి నారి నడుమ మురారి లాంటి చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. సంక్రాంతి రేస్ లో ప్రభాస్, చిరు, రవితేజ, నవీన్ పోలిశెట్టి లాంటి హీరోలను ఢీ కొట్టి విజయం సాధించాడు. దానితో శర్వానంద్ పై బయ్యర్ల లో నమ్మకం స్టార్ట్ అయ్యింది. ఈ ఊపులోనే శర్వానంద్ మంచి ప్లాన్ చేసాడు.
అదే మరుగున పడిపోతున్న బైకర్ ని పైకి లేపుతున్నాడు. డిసెంబర్లోనే విడుదలవుతుంది అనుకున్న బైకర్ చడీ చప్పుడు చెయ్యకుండా సైలెంట్ అయ్యింది. నారి నారి నడుమ మురారి సక్సెస్ ఊపులో ఇప్పుడు శర్వానంద్ బైకర్ రిలీజ్ డేట్ లాక్ చేస్తున్నారు. ఏప్రిల్ 3 న శర్వానంద్ బైకర్ ని రిలీజ్ చేస్తున్నారు.
పర్ఫెక్ట్ టైమ్ లో శర్వానంద్ బైకర్ ని సెట్ చేసాడు అంటూ ఆయన ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. నిజంగానే శర్వానంద్ నారి నారి నడుమ మురారి విడుదలైన మూడు నెలలోపే బైకర్ ని బరిలోకి దించడం గమనార్హం.