ఎస్ ఎస్ రాజమౌళి ఎప్పుడు చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తారు. సినిమా షూటింగ్స్ అయినా, ప్రమోషనల్ ప్లానింగ్ అయినా ఏదైనా ఎవ్వరి ఊహలకు అందనంతగా ఆయన ఆలోచనలు ఉంటాయి. ప్రమోషన్స్ విషయమే తీసుకోండి, రాజమౌళిని మ్యాచ్ చేసే దర్శకుడు ఉన్నాడా, ఇక మహేష్ బాబు తో మొదలు పెట్టిన వారణాసి అప్ డేట్స్ విషయంలో ఆచి తూచి కదిలిన రాజమౌళి ఒక్క ఈవెంట్ తోనే గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసారు.
ఆతర్వాత వారణాసి అప్ డేట్స్ వరసగా వదులుతున్నారు. ఇక వారణాసి రిలీజ్ డేట్ విషయంలో సోషల్ మీడియాలో నడుస్తున్న ఊహాగానాలకు వారణాసి వేదికగా చెక్ పెట్టారు. వారణాసిలో వారణాసి సినిమా రిలీజ్ డేట్ పోస్టర్స్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ కి ఎక్కాయి. ఏప్రిల్ 7, 2027 సినిమా రిలీజ్ అంటూ పోస్టర్స్ వెలిసాయి.
మరి ఏ ఈవెంట్ ప్లాన్ చెయ్యకుండా, సైలెంట్ గా సోషల్ మీడియా లో వదలకుండా వారణాసి లో వారణాసి సినిమా రిలీజ్ డేట్ ప్లాన్ చెయ్యడం అనేది రాజమౌళికే సాద్యమైంది అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. వారణాసి టైటిల్ కి పూర్తి న్యాయం చేస్తూ వారణాసిలో ఇలా రాజమౌళి ప్లాన్ చెయ్యడం చూసి అందరూ షాకైపోతున్నారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో వారణాసిలో వెలసిన వారణాసి రిలీజ్ డేట్ పోస్టర్స్ అంటూ తెగ వైరల్ అవుతున్నాయి.