సింగిల్ లాగ్వేంజ్ లో బాలీవుడ్ చిత్రం `ధురంధర్` ఇండియాను దున్నేసిన సంగతి తెలిసిందే. ఒకే ఒక్క భాషలో రిలీజ్ అయి ఏకంగా 1300 కోట్ల వసూళ్లను సాధించి భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇంత వరకూ ఇలాంటి రికార్డు మరే సినిమా పేరిట లేదు. తెలుగు నుంచి రిలీజ్ అయిన చాలా సినిమాలు పాన్ ఇండియాలో విజయం సాధించాయి.
వెయి కోట్లకు పైగా వసూళ్లను సాధించిన చిత్రాలెన్నో ఉన్నాయి. శాండిల్ వుడ్ నుంచి `కేజీఎఫ్` ప్రాంచైజీ పాన్ ఇండి యాలో గొప్ప విజయాన్ని సాధించింది. కానీ ఇవన్నీ అంత పెద్ద సక్సెస్ ఒకే భాషతో సాధించలేదు. సౌత్ నుంచి పాన్ ఇండియాలో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఆయా భాషల్లో అనువాద రూపంలో విడుదలైనవే.
ఒకే భాషలో రిలీజ్ అయి 100 కోట్లు కొల్లగొట్టిన సినిమా అంటూ ఏదీ లేదు. మరి సౌత్ సినిమాకు సింగిల్ లాంగ్వేజ్ లో సత్తా చాటలేదా? అంటే అదంత సులభం కాదు. దాదాపు అసాధ్యమే కావొచ్చు. `ధురంధర్` హిందీలో రిలీజ్ అయిన చిత్రం. హిందీ దేశ అధికారిక భాష. చాలా రాష్ట్రాల్లో కామన్ గా మాట్లాడే లాంగ్వేజ్ ఇది.
భారత్ లో ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ కూడా ఇదే. మెట్రో పాలిటన్ సిటీస్ లో హిందీకే ప్రాధాన్యత. ఇలాంటి కారణాలన్ని `ధురంధర్` సింగిల్ లాగ్వేంజ్ సక్సస్ కు ప్రధాన కారణాలుగా మారాయి. ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో? మరే సినిమా పోటీ గా కూడా లేదు. తెలుగు సినిమా రీజనల్ మార్కెట్ లో తప్ప ఇంకెక్కడా వర్కౌట్ అవ్వదు. పక్కనే ఉన్న తమిళనాడులో రిలీజ్ చేసినా? పట్టించుకునే పరిస్థితి లేదు. కర్ణాటకలోనూ అదే పరిస్థితి. ఈ రెండు రాస్ట్రాల్లో తెలుగు భాషపై రాజకీయాలు కూడా ఎక్కువే. పక్కనున్న రాష్ట్రాలతోనే ఇన్ని సమస్యలుంటే రికార్డులు ఎలా సాద్యమవుతాయి? అన్నది ఆలోచించాల్సిన విషయమే.