తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్యెల్యే హరీష్ రావు, సంతోష్ రావు లని ఈ కేసులో విచారణకు పిలిచిన SIT ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కి నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ విచారణకు సహకరించాలని SIT ఆ నోటీసుల్లో తెలిపింది.
అయితే మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ పోరాటయోధుడు కేసీఆర్ కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు భగ్గుమన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ని నందినగర్ కేసీఆర్ ని ఇంట్లోనే విచారణ జరిపేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
కానీ కెసిఆర్ మాత్రం తాను రేపు విచారణకు రాలేనని, మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉందని తెలిపారు, మరోరోజు విచారణకు కేటాయించాలని కోరారు SIT కి కేసీఆర్ లేఖ రాసారు. అంతేకాదు మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా తాను విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు.
అలాగే తనను ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారణ చేయాలని ఆయన SIT కి విజ్ఞప్తి చేశారు. మరి కేసీఆర్ లేఖపై SIT ఎలా స్పందిస్తుందో చూడాలి.