అవును బాలీవుడ్ లో గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన రణ్ వీర్ సింగ్-ఆదిత్య ధార్ ల ధురంధర్ చిత్రం ఫైనల్లీ ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. మరో వారంలో రెండు నెలలు పూర్తి చేసుకుంటున్న ధురంధర్ చిత్రం 55 రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతుంది. థియేటర్స్ లో 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ధురంధర్ ప్రభంజనం మరికొద్ది గంటల్లో ఓటీటీ లో మొదలు కాబోతుంది.
ధురంధర్ ఓటీటీ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ రేపు అంటే జనవరి 30 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే అనౌన్సమెంట్ ఇచ్చింది. మరికొన్ని గంటల్లోనే ఈ హిట్ సినిమా ఓటీటీ వేదికగా ఆడియన్స్ ముందుకు వస్తుంది.
థియేటర్స్ లో సౌండ్ చేసినంతగా ధురంధర్ నెట్ ఫ్లిక్స్ లోను సౌండ్ చేస్తుందా, థియేటర్స్ లో బొమ్మ బ్లాక్ బస్టర్, మరి ఓటీటీ లో అదే ఇప్పుడు అందరి ముందు ఉన్న ఉత్సుకత. అన్నట్టు నెట్ ఫ్లిక్స్ నుంచి ధురంధర్ కేవలం హిందీ లాంగ్వేజ్ లోనే స్ట్రీమింగ్ అవుతుందా, లేదంటే మిగతా లాంగ్వేజెస్ లోను అందుబాటులోకి వస్తుందా అనేది క్లారిటీ లేదు.