కొన్నాళ్లుగా హిట్ సినిమాలు, ప్లాప్ సినిమాలు ఒకే గాటిన ఓటీటీ కి చేరుకుంటున్నాయి. ఏ సినిమా అయినా నెల తిరిగేలోపు ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు థియేటర్ కి వెళతారు. ప్రస్తుతం సినిమాల భవితవ్యం ఓటీటీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అందుకే ఓటీటీ లు కూడా తమ డిమాండ్స్ తో నిర్మాతలను ఠారెత్తిస్తున్నాయి.
థియేటర్ ఆదాయం తగ్గినా ఓటీటీ లనే కొంతమంది నిర్మాతలు నమ్ముకుంటున్నారు. కానీ హిట్ సినిమాలు మినిమమ్ 8 వారాల గ్యాప్ తో ఓటీటీ డీల్ పెట్టుకుంటే బావుంటుంది. ఇప్పుడు బాలీవుడ్ లో హిట్ అయిన ధురంధర్ నే చూడండి.. సినిమా విడుదలై రెండు నెలలవుతుంది. ఇప్పటివరకు ధురంధర్ ఓటీటీ పార్ట్నర్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చెయ్యలేదు.
జనవరి 30 నుంచి ధురంధర్ స్ట్రీమింగ్ అంటున్నా నెట్ ఫ్లిక్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ధురంధర్ బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాంటి చిత్రం రెండు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నా దానిపై క్లారిటీ లేదు.
ఇలానే హిట్ సినిమాలు రెండు నెలలు అంటే ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీ కి తెస్తే ఆటోమాటిక్ గా థియేట్రికల్ రన్ ఉంటుంది. ఈ విషయంలో దర్శకనిర్మాతలు కాస్త ఆలోచిస్తే బెటర్. అక్కర్లేదు మాకు ఓటీటీ డీలింగ్స్ మాత్రమే ముఖ్యం అంటే కష్టం సుమీ..