మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు సూపర్ హిట్ అవడంతో ఆయన నుంచి ఎప్పుడో రావాల్సిన విశ్వంభర చిత్రం పై దాని స్టేటస్ పై మెగాస్టార్ పై ప్రెజర్ పెరిగింది. మన శంకర వరప్రసాద్ గారు హిట్ మూడ్ లోనే విశ్వంభర అప్డేట్ వదలమని మెగా ఫ్యాన్స్ ఒత్తిడి చేస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కొంతమంది మీడియా మిత్రులను కలిసిన సందర్భంలో విశ్వంభర విడుదల తేదీపై ప్రశ్నించారు. దానికి మెగాస్టార్ స్పందిస్తూ జూన్ లేదా జూలైలో అని అనుకుంటున్నారు. మోస్ట్ ప్రోబబ్లీ.. జూలై 9 లేదా 10 ఉండొచ్చు అంటూ చిరు విశ్వంభర రిలీజ్ పై సూపర్ అప్ డేట్ ఇచ్చారు.
మరి దర్శకుడు వసిష్ఠ విశ్వంభర సీజీ వర్క్ త్వరగా పూర్తి చేసి డేట్ ని అనౌన్స్ చేస్తే బావుంటుంది. ఈ చిత్రంలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా ఆషిక రంగనాధ్, సురభి లాంటి హీరోయిన్స్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు, వాళ్లతో పాటుగా శ్రీలీల ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది.